దమ్మపేటలో కలకలం
( దమ్మపేట , ఆంధ్రప్రభ ) దమ్మపేట మండల పరిధిలోని అంకంపాలెం గిరిజన గురుకుల సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన ఆదివారం రాత్రి తీవ్ర కలకలం రేపింది.
కుటుంబ సభ్యుల్లో కలవరం సృష్టించింది. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆదివారం ఉదయం బయటకు వెళ్లారు .
బయటకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి రాకపోవటంతో కళాశాల ఇంగ్లీష్ లెక్చెరర్ బానోత్ హరిత విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు .చుట్టుపక్కల ప్రాంతాలు , గ్రామాలలో గాలించినప్పటికీ విద్యార్థినిల ఆచూకీ లభ్యం కాకపోవటంతో లెక్చరర్ హరిత ఆదివారం రాత్రి దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు .
లెక్చెరర్ హరిత ఫిర్యాదు మేరకు దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు .