TG | నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం : హరీశ్‌రావు
సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడదామన్నారు…. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆరాటపడిన కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చుదాం అని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమైన మాజీ మంత్రి హరీష్ రావు.. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్‌లో చర్యలు తీసుకోవాలని.. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణ ఖేడ్, అందోల్ నియోజకవర్గాల బీఆర్‌ఎస్ కార్యకర్తలను సమీకరించండని పిలుపినిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ పథకాలు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోకాపేటలోని తన నివాసంలో సమావేశమయ్యారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీ మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు జరగబోయే పోరాటంపై చర్చించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణ్ ఖేడ్ లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుల వైపు తొంగి కూడా చూడలేదు.
‘‘రెండేళ్ల క్రితం 2022 ఫిబ్రవరి 21న నారాయణ్‌ఖేడ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్, ఆందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల సాగు నీరు కలగానే మారింది.
దీంతో ప్రభుత్వంలో కదలిక తెచ్చి, ప్రాజెక్టులు పూర్తి చేయించి, దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులపై పోరాటానికి సిద్ధం అవుదామని పిలుపునిచ్చారు. ఆ దిశగా సంసిద్ధం కావాలని సూచించారు.