ప్రత్యేకంగా అప్లికేషన్‌ను రూపొందించాం

ప్రత్యేకంగా అప్లికేషన్‌ను రూపొందించాం
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : కార్యకర్తలందరి నిర్ణయంతోనే నల్లగొండ(Nalgonda) డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని ఏఐసీసీ(AICC) కార్యదర్శి సంపత్ కుమార్ చెప్పారు. ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బిస్వ రాజన్ మహంతి(Biswa Rajan Mohanty)తో కలిసి ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కార్యకర్తల సమక్షంలోనే కార్యకర్తల అభిప్రాయాల మేరకు ప్రజాస్వామ్య విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంని చెప్పారు. డీసీసీ(DCC) అధ్యక్షుడి నియామకం కోసం ప్రత్యేకంగా అప్లికేషన్‌ను రూపొందించామని డీసీసీ పదవి కోరుకునే ప్రతి కార్యకర్త అప్లికేషన్‌ను పూర్తి చేసి అందించవచ్చని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీలో పార్టీ అధ్యక్షుల ఎన్నిక కేసీఆర్(KCR) వంటింట్లో కూర్చొని ఎంపిక చేస్తారని, జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీలో నరేంద్ర మోడీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకుంటేనే పదవులు వస్తాయని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పార్టీ పదవులను భర్తీ చేసే సాంప్రదాయం ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్(Shankar Nayak) పార్టీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తారన్నారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ తగిన గుర్తింపునిస్తుందని సంపత్ హామీ ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్(Ketawat Shankar Nayak), మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
