కూటమి కుటీల రాజకీయాలను తిప్పికొడతాం

కూటమి కుటీల రాజకీయాలను తిప్పికొడతాం

ప్రభుత్వాన్ని నిలదీస్తాం..కోటి సంతకాలు సేకరిస్తాం
విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిన సీఎం
పోలీసు వ్యవస్థతో జగన్ ను ఆపలేరు
డబ్బు దండుకోవడానికి పిపిపి విధానం
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
వైసీపీ శ్రేణుల మధ్య కోటి సంతకాల పోస్టర్ రిలీజ్

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : రాష్ట్ర ప్రజలందరి సహకారంతో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వ కుటిల రాజకీయాలను తిప్పికొడుతూనే ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించనున్నట్లు చెప్పారు. విద్యా వ్యవస్థను సమూలంగా భ్ర‌ష్టు ప‌ట్టించిన సీఎం చంద్రబాబు నాయుడు తీరును ప్రజలకు వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకొస్తామన్నారు. విజయవాడలోని గుణదలలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాల పోస్టర్ ను వైసిపి నాయకులు శ్రేణుల మధ్య దేవినేని అవినాష్ శుక్రవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి సంతకాలను 45 రోజుల ప్రజా ఉద్యమంలో భాగంగా సేకరిస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపారని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయటమేనా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. పీపీపీ పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజీలను కట్టపెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుంటే వైయస్సార్ సీపీ నేతలు చూస్తూ ఊరుకోరని వీటిని సమగ్రంగా తిప్పికొడతామన్నారు. విద్య‌, వైద్యం రెండు కళ్ళుగా జగన్ హయాంలో పాలన సాగిందని, పులివెందుల మెడికల్ కాలేజీలలో మెడికల్ సీట్లను వద్దన్న నీచ వ్యక్తి చంద్రబాబు నాయుడని ఘాటుగా విమర్శించారు.

స్కూల్, కాలేజ్, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని జగన్ అభిమానులను ఆపలేరన్నారు. ఆటో డ్రైవర్ సేవలో అని ఆటో డ్రైవర్ సోదరులను దగా చేశారని, గతంలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే .. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు పునాదులు వేశారని గుర్తు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల నుండి డబ్బులు దండుకోవాలనే పీపీపీ విధానం తీసుకొచ్చారని విమర్శించారు.

మళ్ళీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే.. మొత్తం 10 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా పూర్తై ఉండేవన్నారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను అందజేస్తాం అని, కూటమి నాయకులు చేసే కుటిల రాజకీయాలను ప్రజలోకి తీసుకెళ్తాం అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కార్పొరేటర్లు రాష్ట్ర జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు డివిజన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మహిళా నాయకులు వైసిపి అభిమానులు శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply