ఢిల్లీలో టుడేస్ ట్రావెలర్ అవార్డులు !!

న్యూఢిల్లీ (ఆంధ్రప్రభ ప్రతినిధి): పర్యాటక రంగంలో తెలంగాణ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. న్యూ ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్‌లో బుధవారం జరిగిన ప్రతిష్టాత్మక టుడేస్ ట్రావెలర్ 28వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో తెలంగాణ నాలుగు విభాగాల్లో విజయం సాధించింది.

ఈ కార్యక్రమంలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, కంపెనీలకు మొత్తం 35 అవార్డులు ప్రదానం చేశారు. అయితతే, అందులో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించింది. తాజాగా ముగిసిన బతుకమ్మ పండుగను విస్తృతంగా ప్రోత్సహించినందుకు… తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ప్రమోషన్ ప్రచార అవార్డు అందుకుంది.

అదనంగా, హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్, వెస్టిన్ హోటల్, అలాగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) తమ విభాగాల్లో అత్యుత్తమతకు గాను అవార్డులను సొంతం చేసుకున్నాయి.

పర్యాటకం, హాస్పిటాలిటీ, విమానయాన రంగాల భవిష్యత్తుపై పరిశ్రమ నిపుణులు, ఆలోచనాపరులు చర్చించేందుకు టుడేస్ ట్రావెలర్ వార్షికోత్సవం ముఖ్య వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం శాఖ కూడా పాల్గొనడం విశేషం.

Leave a Reply