వ్య‌క్తి మృతి

వ్య‌క్తి మృతి

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : బ‌ట్ట‌ల‌కు బుర‌ద క‌డుక్కోవ‌డానికి వెళ్లి ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కమ్మర్ పల్లి(Blacksmith’s Village) మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కమ్మర్ పల్లి ఎస్ఐ జీ. అనిల్ రెడ్డి(SI G. Anil Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమిరే రాజేందర్(Komire Rajender) (47) బట్టలకు బురద అంటుకోవడంతో కడుక్కోవడానికి నాగపూర్(Nagpur) గ్రామానికి వెళ్లే రోడ్డు వరద కాలువలో దిగి బురద కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి మునిగి చనిపోయినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు(case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి. అనిల్ రెడ్డి తెలిపారు.

Leave a Reply