స్టాలిన్, త్రిషకు బెదిరింపులు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రముఖులకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, హీరోయిన్ త్రిష, బీజేపీ (BJP) ప్రధాన కార్యాలయం, రాజ్ భవన్, డీజీపీ ఆఫీసుకి బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి. ఆరు రోజుల్లో ఇలా బెదిరింపులు రావడం ఇది మూడవసారి.
దీంతో రాష్ట్ర, దేశ భద్రతా బలగాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ (bomb squad), డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. అలాగే, చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సీనియర్ అధికారులు (senior officials) దర్యాప్తు ప్రారంభించారు.

