వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికాలోని న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో బుధవారం టాక్సీవేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. రెండు విమానాలను డెల్టా ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ అయిన ఎండీవర్ ఎయిర్ నడుపుతోంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణీకుడు గాయపడ్డాడు. పెద్ద ప్రమాదం తప్పడంలో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం తర్వాత, రెండు విమానాల్లోని ప్రయాణికులను ఖాళీ చేయించి బస్సులో టెర్మినల్‌కు తీసుకెళ్లారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విమానం రాత్రి 9.58 గంటలకు టేకాఫ్‌కు సిద్ధమవుతున్నతరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

