జాతిపిత‌కు ఘ‌న నివాళులు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) నివాళులర్పించారు. ఈ రోజు హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.

ఈ సంద‌ర్భంగా గాంధీజీ సంగీత ప్రదర్శనను వారు కాసేపు తిలకించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితరులు ఉన్నారు.

Leave a Reply