ఇందిర‌మ్మ టిఫిన్ క్యాంటీన్లు ప్రారంభం

ఇందిర‌మ్మ టిఫిన్ క్యాంటీన్లు ప్రారంభం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హైద‌రాబాద్‌లో ఐదు రూపాయలకే టిఫిన్ అందించే ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ టిఫిన్ క్యాంటీన్లను (Indiramma Tiffin Canteens) హైద‌రాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), మేయర్ విజయ లక్ష్మీ, స్థానిక ఎంపీ, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ మేరకు మింట్ కాంపౌండ్ (Mint Compound)లో ఏర్పాటు చేసిన క్యాంటిన్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అందులోనే అధికారులతో కలిసి మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి టిఫిన్ చేశారు.

జీహెచ్ఎంసీ (GHMC) ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా మొత్తం 12 ఇందిరమ్మ క్యాంటీన్ లను ప్రారంభించిన‌ట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఈ ఇందిరమ్మ క్యాంటీన్‌లలో ఉదయం టిఫిన్‌ భాగంగా కేవలం ఐదు రూపాయలకే మిల్లెట్ బ్రేక్ ఫాస్ట్ (Millet breakfast), మధ్యాహ్నం భోజనం అందించనున్నారు.

ప్రతి రోజు 30 వేల మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు రూపాయలకు బ్రేక్ ఫాస్ట్ (Breakfast for five rupees) ఇచ్చే ఈ పథకానికి ఏడాదికి రూ. 12.60 కోట్లు ఖర్చు చేస్తున్నామని, హరికృష్ణ ఫౌండేషన్ (Harikrishna Foundation) ఇందిరమ్మ క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తుందని చెప్పారు.

Leave a Reply