రెవెన్యూ కేసుల్లో సకాలంలో

రెవెన్యూ కేసుల్లో సకాలంలో

  • కౌంటర్ లు దాఖలు చేయండి
  • చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లా ప్రధాన కోర్టులో నమోదైన రెవెన్యూ(Revenue) కేసుల్లో సకాలంలో స్పందించి కౌంటర్‌లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తహశీల్దార్‌లను ఆదేశించారు. గురువారం జిల్లాలో రెవెన్యూ కేసులు పెండింగ్‌(Pending)కు సంబంధించి జిల్లా కలెక్టర్ డీఆర్ఓ మోహన్‌(DRO Mohan)తో కలసి తహశీల్దార్ లు, ఎంపీడీఓల(MPDOs)తో వీడియో కాన్ఫరెన్స్(video conference) నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన న్యాయ స్థానం లోని 14 కోర్టుల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 59 కేసులు ఉండగా అందులో 27 కేసులు ఎక్స్(Ex.) పార్టీగా గుర్తించారని, వీటికి వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన భాధ్యత తహశీల్దార్ల(Tehsildars)పై ఉందన్నారు. మండలాల పరిధిలో నమోదైన కేసులకు పూర్తి భాధ్యత తహశీల్దార్లు తీసుకోవాలని తెలిపారు. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌గా రెవెన్యూ చట్టాల పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

కేసుల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వ జీపీ ని సంప్రదించి సకాలంలో కౌంటర్ లు దాఖలు చేయాలన్నారు. ఇ–కోర్టు వెబ్ సైటు(E-Court Website)లో కేసుల వివరాలు, స్థితిని పరిశీలించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఎక్స్ పార్టీగా ఉన్నకేసులు అన్నింటికీ 2 రోజులలో రిటర్న్ స్టేట్ మెంట్(Return Statement), కౌంటర్లు వేయాలని ఆదేశించారు. జిల్లా కోర్టులోని రెవెన్యూ కేసు లకు సంబంధించి తహశీల్దార్లను సమన్వయపరచేలా వీఆర్ఓ స్థాయి సిబ్బందిని లైజన్ అధికారిగా నియమిస్తామన్నారు.

Leave a Reply