పారిశుధ్య కార్మికులతో కలసి ..

  • చీపురు పట్టి ..శుభ్రం చేసి..
  • స్ఫూర్తినిచ్చిన కర్నూలు కలెక్టర్

కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : పరిశుభ్రత తోనే ఆరోగ్యంగా ఉండగలమని, కర్నూలు(Kurnool) జిల్లాను ప‌రిశుభ్రంగా ఉంచ‌డంలో ప్రతి ఒక్కరూ త‌మవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురు వారం స్వచ్ఛతా హీ సేవ – 2025లో భాగంగా నిర్వహించిన ఏక్ దిన్ – ఏక్ గంట – ఏక్ సాత్(Ek Din – Ek Ganta – Ek Saat) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

తుంగభద్ర నది(Tungabhadra River), సంకల్ బాగ్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ(Swachhta Hi Seva) కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ – ఏక్ గంట – ఏక్ సాథ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ముంద‌డుగు వేయాల‌ని కలెక్టర్ కోరారు.

మన ఇంటి తో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని కలెక్టర్ సూచించారు.. చెత్తను కాలువ‌ల్లోను, రోడ్ల పక్కన వేయకుండా పారిశుధ్య కార్మికులు(Sanitation Workers) ఇంటివ‌ద్దకు వ‌చ్చిన‌ప్పుడే చెత్తను అందించాలన్నారు. ప‌రిస‌రాలు శుభ్రంగా ఉంచడం వల్ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌, వ్యాధుల నివార‌ణ‌కు దోహ‌దప‌డుతుంద‌ని కలెక్టర్( Collector) తెలిపారు.

తడి, పొడి చెత్త వేరు వేరుగా వేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అక్కడే ఉన్నపారిశుధ్య కార్మికులతో కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఖచ్చితంగా గ్లౌస్ లు, మాస్క్ లు(Gloves, Masks) ధరించాలని కలెక్టర్ సూచించారు… పనిముట్లు ఇస్తున్నారా? లేదా ? అని కలెక్టర్ పారిశుధ్య కార్మికులను ఆరా తీశార.

పారిశుధ్య కార్మికులకు ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించాలని కలెక్టర్ ప్రజారోగ్య అధికారిని ఆదేశించారు… పారిశుధ్య కార్మికులు పోషకాహారాన్నితీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ పారిశుధ్య కార్మికులకి సూచించారు.. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఎస్ఈ శేష సాయి(SE Sesha Sai), ప్రజారోగ్య అధికారి విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply