నేడు నానబియ్యం బతుకమ్మ !!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ.. ప్రకృతి, ఆధ్యాత్మికత, మహిళా శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది. సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభ‌మైన ఈ పండుగ‌.. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో మహిళలు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ నృత్యాలు చేస్తూ, గౌరీ దేవిని పూజిస్తారు.

తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే బ‌తుక‌మ్మ‌ పండుగను.. ప్రతి రోజు ఒక కొత్త నైవేద్యంతో, ఒక ప్రత్యేకమైన ఆరాధనతో బతుకమ్మను పూజిస్తారు. ఈ క్రమంలో, ఐదవ రోజు జరుపుకునే నానబియ్యం బతుకమ్మకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.

ఈ తొమ్మిది రోజుల్లో భాగంగా ఈరోజు (సెప్టెంబ‌ర్ 24న‌) నానబియ్యం బతుకమ్మ ను పూజిస్తారు. నానబెట్టిన బియ్యం, బెల్లంతో నైవేధ్యం చేస్తారు. బతుకమ్మ పూజలో భాగంగా స్త్రీలు నానబెట్టిన బియ్యం, పెసర పప్పు, పాలు, పెరుగు, బెల్లం, తేనెతో కలిసి ఒక ప్రత్యేక నైవేద్యం తయారు చేస్తారు. ఈ నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పించి, పూజ అనంతరం అందరూ పంచుకుంటారు.

Leave a Reply