అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న‌ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వ‌గా, క్షణాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు ప్రీ-సేల్స్‌లోనే ఈ సినిమా రూ.30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా ఓవర్సీస్‌లో ‘ఓజీ’ భారీ వసూళ్లు రాబడుతోంది. ఓవర్సీస్ ప్రీమియర్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే $2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ట్రైలర్ విడుదలయ్యాక ఈ సంఖ్య మరింత పెరిగి, $3 మిలియన్ డాలర్ల మార్కును దాటే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఈ సినిమా అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకి సుజిత్ దర్శకత్వం వహించ‌గా.. డీవీవీ దానయ్య, DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, సిరి లెళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Leave a Reply