నాలుగిళ్లలో చోరీ
బాసర, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు (Thieves) హల్చల్ చేశారు. సుమారు 3 గంటల నుంచి 3.30 నిమిషాల వరకు తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేశారు. మూడు ఇండ్లలో బీరువాలో బంగారు (gold), వెండి (silver), నగదును, శారద బేకరీలో షట్టర్ తొలగించి డబ్బులు దొంగలించినట్లు బాధితులు తెలిపారు.

నలుగురు సభ్యుల బృందం ముఖానికి ముసుగు వేసుకొని గొడుగులు పట్టుకొని నాలుగు ఇళ్లతోపాటు ఒక బేకరీ లో దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ కెమెరా (CCTV camera)లలో దొంగలు ముసుగు వేసుకొని అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. సమాచారం అందుకున్న ముధోల్ సీఐ మల్లేష్, ఎస్సై శ్రీనివాస్ చోరీ జరిగిన ఇండ్లను, బేకరీని పరిశీలించారు. శ్రీను మేస్త్రి తోపాటు ఇతర ఇంటి యజమానులు ఇంట్లో లేకపోవడంతో ఎంత దోచుకెళ్లారో తెలియడం లేదు. ఇంటి యజమానులు వస్తే మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. చోరీ జరిగిన ఇళ్లను, బేకరీ (bakery)ని ముధోల్ సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రీనివాస్ పరిశీలించారు అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించారు.

