చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నగర ప్రజలు, యువత, నాయకులు అంతా కలిసి చిత్తూరును అందంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ (MLA Gurajala JaganMohan ) పిలుపునిచ్చారు. స్వచ్ఛతాహీ సేవ -2025 కార్యక్రమాల్లో భాగంగా బుధవారం చిత్తూరులో స్వచ్ఛతోత్సవ్ ర్యాలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, మేయర్ ఎస్.అముద తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల్లో భాగంగా.. అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, యువత భాగస్వాములై ఎక్కడా చెత్త లేకుండా చూడాలన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara ChandrababuNaidu) స్వచ్ఛ గ్రామాలు, పట్టణాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.. చెత్త లేని నగరంగా చిత్తూరు (Chittoor) ను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహ ప్రసాద్, సహాయ కమిషనర్ ఎ ప్రసాద్, ఎంహెచ్వో డా.లోకేష్, ఏసీపీ నాగేంద్ర, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు, కార్పొరేటర్లు ఇందు, శశి, భాజాపా నాయకులు అట్లూరి శ్రీనివాసులు, తెదేపా నాయకులు వెంకటేష్ యాదవ్, నరేష్ చౌదరి, పచ్చయప్ప, సబితా, రాణి, లీలావతి, రాజేశ్వరి పాల్గొన్నారు.

Leave a Reply