(ఆంధ్రప్రభ‌, వెబ్ డెస్క్): ముంబైలో సోమవారం (15.09.25) ఉదయం అకస్మాత్తుగా మోనో రైలు(Mono train) మొరాయించింది. మరో రెండు నిముషాల్లో స్టేషన్ చేరుతుందని.. గేట్ల దగ్గరకు ప్యాసింజర్లు చేరుతున్నారు. ఇంకేముందీ రైలు కీచు శబ్ధంతో ఆగిపోవటంతో.. రైలు బోగీలోని ప్రయాణికులు(Passengers) కంగారెత్తి పోయారు. ఏమి జరిగిందో అర్థం కాని స్థితిలో.. బోగీలో ఏసీ స్థంభించింది. ఉక్కపోత ప్రారంభమైంది. పిల్లా జెల్లాతో ప్రయాణికుల్లో ఆందోళన పెరిగింది. సెల్ ఫోన్ లో మెసేజీలు పంపారు. ఈ సమాచారంతో బృహన్ ముంబై(Greater Mumbai) మున్సిపల్ కార్పొరేషన్ (BMC), అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రైలు బోగీ తలుపులను తెరిపించారు.

రైలు దిగిన ప్రయాణికులు బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 582 మంది ప్రయాణికులు((Passengers) ఈ రైలు దిగారు. ఇక 23 మంది ఊపిరి సలపక కుప్పకూలారు. వీరికి బీఎంసీ సిబ్బంది(BMC staff) తక్షణ వైద్య సాయం అందించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమించటంతో అంబులెన్సుల్లో ఆసుపత్రి(hospital)కి తరలించారు. ఇక చెంబూరు(Chembur) నుంచి వస్తున్న మరో మోనో రైలులతో ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చారు. కొంత మంది ప్రయాణికులను స్నోర్కెల్ వెహికల్స్ లోనూ.. బెస్ట్ (BEST) బస్సు(bus)ల్లోనూ తరలించారు.

ఈ అనూహ్య ఘటనతో దాదాపు మూడు గంటల పాటు ప్రయాణికులు ప్రత్యక్ష నరకం అనుభ‌వించారు. ఎనీ హౌ.. ఈ అకస్మిక ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం(loss of life) జరగలేదు. ప్రయాణీకులను సురక్షితంగా రైలు నుంచి దించి మరో మోనో రైలు ఎక్కించి గమ్యస్థానాలకు చేర్చినట్టు ముంబై(Mumbai) మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) వెల్లడించింది.

Leave a Reply