ఆ ఐదు జిల్లాలో కుండ‌పోతే..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని వ‌ర్షాలు వ‌ద‌ల‌డం లేదు. మ‌రోసారి రాష్ట్రంలోని ప‌లు జిల్లాలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఆదివారం (సెప్టెంబ‌ర్ 14) నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముందని ప్ర‌క‌టించింది. కామారెడ్డి (Kamareddy), సిరిసిల్ల (Sircilla), కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ ప్ర‌క‌టించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply