ఉదయ సముద్రం రిజర్వాయర్ లో

ఉదయ సముద్రం రిజర్వాయర్ లో

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : చేపలు పట్టేందుకు ఉదయ సముద్రం రిజర్వాయర్(Udaya Samudra Reservoir)లోకి వెళ్లిన సింగం యాదగిరి (37) నీట మునిగి చనిపోయిన ఘటన శనివారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి టూ టౌన్ ఎస్ఐ సైదులు ఈ విధంగా తెలిపారు. నల్లగొండ(Nalgonda) పట్టణానికి చెందిన సింగం యాదగిరి(Yadagiri) చేపలు పట్టే వృత్తిలో ఉన్నాడు.

శనివారం మధ్యాహ్నం తన కుమారుడు సింగం వరుణ్ తేజతో కలిసి చేపలు పట్టేందుకు ఉదయ సముద్రం రిజర్వాయర్ కు వెళ్లాడు. కుమారుడిని గట్టుపై కూర్చోబెట్టి చేపలు పట్టేందుకు రిజర్వాయర్ లోపలికి వెళ్ళగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురు గాలులు వేయడంతో యాదగిరి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ప్రత్యక్షంగా చూసిన కుమారుడు వరుణ్ తేజ్ చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు యాదగిరి ని రక్షించేందుకు ప్రయత్నించినా అతని ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం యాదగిరి మృతదేహం లభ్యమైంది.

మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సైదులు చెప్పారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.

Leave a Reply