అక్కడికక్కడే వ్యక్తి మృతి

అక్కడికక్కడే వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి(Bhuvanagiri) పట్టణంలో చోటు చేసుకుంది. బొమ్మలరామారం, చీకటిమామిడి గ్రామానికి చెందిన గెనారం (42) బైక్ పైన భువనగిరికి వెళ్లే క్రమంలో జగదేవ్పూర్(Jagdevpur) చౌరస్తా వద్దకు రాగానే సిమెంట్ మిక్సర్ లారీ ఢీ కొని తలపై నుంచి వెళ్లడంలో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని(dead body) స్థానిక ఏరియా హాస్పిటల్కు తరలించారు. వెనుక కూర్చున్న మరో వ్యక్తికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు గనెరాం భాద్యతాయుతం(responsibility)గా హెల్మెట్ ధరించినా మృత్యువు వరించింది.
భువనగిరి పట్టణంలోని జగదేవపూర్ చౌరస్తా అనునిత్యం ప్రమాదాలకు నెలవుగా మారింది. గత నెల రోజుల క్రితమే ఇక్కడ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు, ప్రయాణికులు(passengers) తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
