తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన పాలన, నగరాల్లో హరిత వనరుల అభివృద్ధి కోసం కేటీఆర్ చేసిన వినూత్న కార్యక్రమాలకు గాను ఆయనకు ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు’ లభించింది. సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో అతనికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేస్తారు.
హైదరాబాద్‌కు హరిత చైతన్యం
కేటీఆర్ మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖలకు మంత్రి పదవిలో ఉన్న సమయంలో హరిత హారం కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ కృషి ఫలితంగానే రాష్ట్రంలోని పచ్చదనం (green cover) 24% నుండి 33% వరకు పెరిగింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పట్టణాలు, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, పార్కులు ఏర్పాటు చేయడం, చెట్ల సంరక్షణపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టి పర్యావరణ పరిరక్షణలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారు.
ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్
కేటీఆర్ నాయకత్వంలో అమలైన పర్యావరణ విధానాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. హైదరాబాద్ నగరం తన ప్రత్యేకమైన హరిత అభివృద్ధితో అంతర్జాతీయ వేదికలపై నిలిచింది. ప్రపంచ గ్రీన్ సిటీస్ అవార్డును గెలుచుకున్న హైదరాబాద్… ప్రపంచ పటంలో “గ్రీన్ అర్బన్ మోడల్”గా ఆవిర్భవించింది. ఈ అవార్డు నగర పర్యావరణ అభివృద్ధికి గ్లోబల్ స్థాయిలో వచ్చిన గుర్తింపు.
అంతేకాకుండా, ఐక్యరాజ్యసమితి నుండి ప్రత్యేక ప్రశంసలు అందుకోవడం మరో విశేషం. పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ చేపట్టిన చర్యలను యు.ఎన్. అభినందించింది. ఈ విజయాలు కేవలం అవార్డులకే పరిమితం కాకుండా, తెలంగాణను “సుస్థిర పట్టణ అభివృద్ధి”లో ఒక నమూనాగా నిలిపాయి. హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాలకు ప్రేరణగా మారింది.
అంతర్జాతీయ వేదికపై తెలంగాణ
తెలంగాణలో హరిత కార్యక్రమాలకు న్యూయార్క్ అవార్డు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది కేటీఆర్ కు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం సాధించిన విజయానికి అంతర్జాతీయ ముద్రగా చెప్పుకోవచ్చు.

