హైదరాబాద్, ఆంధ్రప్రభ : అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోశారని, దొంగలెవరో తెల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. ఈ రోజు ఎక్స్ వేదిక(X venue)గా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పంచారు. గ్రూప్-1 పరీక్ష(Group-1 Exam)నిర్వహణలో ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశించినట్లుగా గ్రూప్-1 పరీక్ష మళ్లీ తాజాగా నిర్వహించాలని, అవకతవకలపై జుడీషియల్ కమిషన్(Judicial Commission) వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలన్నారు. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.
సర్కారు కొలువు కోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్నీ, అమ్మనాన్నల కష్టార్జితం బూడిదలో పూసిన పన్నీరైందని కేటీఆర్(KTR) ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత(Telangana Youth) నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కార్(Congress Govt) వమ్ముజేసిందని అన్నారు. అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయ్యిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

