• ముఖ్యఅతిథిగా గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌


న‌ల్ల‌గొండ‌, ఆంధ్ర‌ప్ర‌భ : న‌ల్ల‌గొండ‌ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ (Mahatma Gandhi University) నాలుగ‌వ‌ స్నాతకోత్సవం ఈ నెల 15వ తేదీన ఉంద‌ని, ఇందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. స్నాత‌కోత్స‌వానికి ముఖ్యఅతిథిగా గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ పాల్గొంటార‌ని తెలిపారు. ఈ రోజు ఎస్పీ శ‌ర‌త్ చంద్ర ప‌వార్‌, క‌లెక్ట‌ర్ త్రిపాఠి విశ్వ విద్యాల‌యాన్ని సంద‌ర్శించారు. వానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ సమావేశ మందిరంలో అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు.

స‌మావేశంలో క‌లెక్ట‌ర్ త్రిపాఠి (Collector Tripathi) మాట్లాడుతూ… రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ఆయా శాఖల అధికారులు వారి బాధ్యతలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా అధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. 15 న ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను, మెడికల్ టీం, 108,104 ,ప్రత్యేక డాక్టర్ల బృందం ఏర్పాటు చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని, అలాగే డయాస్ ఇతర ఏర్పాట్లు ఆర్ అండ్ బి అధికారులు చూడాలని, తాగునీరు, శానిటేషన్, ఫాగింగ్ వంటివి చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sharat Chandra Pawar) మాట్లాడుతూ… రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ముందు నుండే ఎం జి యూనివర్సిటీ లో పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తామని, తనిఖీలు ఉంటాయని, గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే ఆ రోజు లోపలికి అనుమతిస్తామ‌ని చెప్పారు. గేటు వద్ద తనిఖీ కోసం యూనివర్సిటీ తరఫున నలుగురు బృందం సభ్యులు ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్స్ లర్ లను కోరారు.

వైస్‌ ఛాన్సలర్ ఖాజా అల్లా హుస్సేన్ (Vice Chancellor Khawaja Allah Hussain) మాట్లాడుతూ… స్నాతకోత్సవంలో భాగంగా ఉదయమే స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ వస్తారని, తర్వాత కాన్వకేషన్ లో పాల్గొంటారని, ఈ సందర్భంగా 22 మందికి పీహెచ్‌డీ, 57 మందికి ప్ర‌దానం చేస్తార‌ని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్య‌క్ర‌మం స‌క్ర‌మంగా నిర్వ‌హించేందుకు 12 కమిటీలను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్ , విద్యుత్ డీఈ నదీం అహ్మద్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, డీఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి ,ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply