ముగ్గురు విద్యార్థులకు గాయాలు
ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో, ఆంధ్రప్రభ : మునిపల్లి మండలంలోని లింగంపల్లి(Lingampally) గ్రామంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల (బాలురు) భవనం(building) కూలిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్నమునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల(college) ప్రిన్సిపాల్, సిబ్బంది సహాయంతో గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం జహీరాబాద్(Zaheerabad) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు ఎలాంటి అపాయం లేదని స్పష్టం చేశారు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్(Pankaj) ఘటనపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పిల్లలను తాత్కాలికంగా సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని అధికారులకు సూచించారు. అనంతరం జహీరాబాద్(Zaheerabad) ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని, అక్కడ చికిత్స పొందుతున్నవిద్యార్థులను పరామర్శించారు.

