- అండర్ 14, 17 కరాటే క్రీడాకారుల సెలక్షన్స్
- ఉమ్మడి జిల్లాకు 50 మంది బాల,బాలికల ఎంపిక
గోదావరిఖని ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే క్రీడా పోటీ(sports competition)ల్లో భాగంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ )పెద్దపల్లి జిల్లా పోటీలు గోదావరిఖని పట్టణంలో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు.
సింగరేణి ఆర్ సీఓఏ క్లబ్ వేదికగా ఎస్జీఎఫ్ అండర్- 14, 17 బాల బాలికల కరాటే పోటీలు ఘనంగా జరిగాయి. పెద్దపెల్లి జిల్లా కరాటే టోర్నమెంట్(karate tournament), సెలక్షన్స్నువ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్(association) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమురోజు శ్రీనివాస్, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ కనుకుంట్ల లక్ష్మణ్ ప్రారంభించారు.
పెద్దపెల్లి జిల్లాకు చెందిన కరాటే క్రీడాకారులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయిలో నిర్వహించే పోటీల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి సెలక్షన్స్నుఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్(education foundation) ఆఫ్ ఇండియా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ తగర శంకర్, సిటోరియో కరాటే అసోసియేషన్ స్టేట్ చీఫ్ కరాటే శ్రీనివాస్, జిల్లా కరాటే అసోసియేషన్ ప్రతినిధి వడ్డేపల్లి సురేష్ పర్యవేక్షణ చేశారు.
ఈ సెలక్షన్, టోర్నమెంట్ కు బోయపోతు రాము, పసునూటి చందు, శ్రావణ్ కుమార్, బండి పరమేష్ రెఫరల్గా వ్యవహరించారు. జిల్లాలోని రామగుండం, గోదావరిఖని, మంథని, కమాన్పూర్ ,పెద్దపల్లి ,ధర్మారం, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, బసంత్ నగర్ ప్రాంతాల నుండి సుమారుగా 250 మంది కరాటే క్రీడాకారులు(athletes) పాల్గొనగా పెద్దపల్లి జిల్లా నుండి 50 మంది పథకాలు సాధించారు.
వందలాది మంది క్రీడాకారులతో టోర్నమెంట్(tournament)కు అనూహ స్పందన లభించింది. ఈ పోటీల్లో వ్యాయామ ఉపాధ్యాయులు శోభ, జావిద్, విజయ్, సీనియర్ కరాటే మాస్టర్(karate master) కే ముండయ్య, పసునూటి శంకర్, బసంత్ నగర్ లక్ష్మణ్, కొండ్ర నాగరాజు, రమేష్, కనకేష్, పెద్దపల్లి వెంకటేష్ తోపాటు వందల మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు.

