ఖైర‌తాబాద్ గ‌ణేశ్ శోభాయాత్ర షురూ..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హైద‌రాబాద్‌లోని ఖైర‌తాబాద్‌లో కొలువైన మ‌హా గ‌ణ‌ప‌తి శోభాయాత్ర ప్రారంభ‌మైంది. భారీ జ‌న‌సందోహం మ‌ధ్య గ‌ణ‌నాథుడు నిమ‌జ్జ‌నానికి త‌ర‌లివెళ్తున్నాడు. భాగ్య‌న‌గ‌రంలో 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న శోభాయాత్రలు, నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జీహెచ్‌ఎంసీ 13 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి 15 వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 30 వేల మంది పోలీసులు నిమజ్జన ఘట్టంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

160 యాక్షన్‌ టీంలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనులు, 134 క్రేన్లు, 259 మొబైల్‌ క్రేన్లు అధికారులు అందుబాటులో ఉంచారు. హైడ్రా, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్‌ సాగర్‌లో 9 బోట్లు సిద్ధం చేయగా, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది.

Leave a Reply