భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి(Bhupalpalli) జిల్లా కేంద్రంలో ఈనెల 3న కిడ్నాప్‌కు గురైన వ్యక్తి ములుగు జిల్లా మేడారం అడవుల్లో దారుణ హత్యకు గురి కాగా మృత దేహం శుక్రవారం లభ్యమైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్‌కు చెందిన మహమ్మద్ బాసిత్ (20) సెప్టెంబర్ 3న తన మిత్రుడు అరుణ్‌తో కలిసి బైక్(bike) పై కోర్ట్ నుండి వస్తున్నక్రమంలో శాంతి నగర్ జంక్షన్(Shanti Nagar Junction) చర్చి వద్ద మధ్యాహ్నం 1.30 గంటలకు బబ్లు, ప్రశాంత్, కుషాల్ మరి కొంత మంది వ్యక్తులు ఇద్దరి పై దాడి చేసి ఎండి బాసిత్‌ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారాని మృతుడి తల్లి సభియ భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్న క్రమంలో శుక్రవారం ములుగు జిల్లా మేడారం నుండి తాడ్వాయి వైపు వస్తుంటే సుమారు 2కి. మీ దూరంలో రోడ్డు నుండి కుడి వైపు 500 మీటర్ల దూరంలో గుట్ట దిగాక కట్టేసి చంపి కాల్చినట్లు పోలీసులు గుర్తించారు. భూపాలపల్లి సీఐ నరేష్(CI Naresh), ఎస్ఐ సాంబమూర్తి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, పంచనామా నిర్వహించి భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

