TG | పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
దేవరకొండ మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మండలంలోని బొడ్డుపల్లి గ్రామానికి కి చెందిన దువ్వా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పడమటపల్లి గ్రామానికి చెందిన మసన శివకుమార్ లను, కోశాధికారిగా శేఖర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈసందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… తమ మీద పెట్టిన నూతన బాధ్యతలను శక్తి వంచన లేకుండా నిర్వహిస్తామని మండలంలో పద్మశాలి సమాజం అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేవరకొండ డివిజన్, జిల్లా పెద్దల సలహాలు సూచనలతో సంఘాన్ని మరింత పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్తామన్నారు. తమ ఎన్నికకి సహకరించిన స్థానిక పద్మశాలి సంఘం నాయకులకు ,రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.