ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బెంగళూరు చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium, Bangalore)లో మ్యాచ్‌లు పునః ప్రారంభం కానున్నాయి. జూన్ 04న జరిగిన తొక్కిసలాట ఘటన తొలిసారి క్రికెట్ మ్యాచ్ (cricket match)కు ఆతిథ్యం ఇచ్చేందుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధం అవుతోంది. దీంతో బెంగళూరు అభిమానులు కాస్త సంతోషపడుతున్నారు. కానీ, ఈ మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులకు మాత్రం స్టేడియంలోకి అనుమతి లేదు.
17ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025 ఐపీఎల్ (IPL)లో ఆర్సీబీ టైటిల్ నెగ్గింది. దీంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ (RCB Management) జూన్ 04న విక్టరీ పరేడ్, చిన్నస్వామిలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో అభిమానులు గాయపడ్డారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో భద్రతా కారణాల వల్ల గత మూడు నెలల్లో అక్కడ మ్యాచ్‌లు జరగలేదు. చిన్నస్వామిలో డొమెస్టిక్ లీగ్ మహారాజ టోర్నీ, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ (ICC Women’s ODI World Cup)లో పలు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ, ఆయా కారణాల వల్ల మహారాజ టోర్నీని మైసూర్‌కు మార్చగా, మహిళల వన్డే వరల్డ్కప్మ్యాచ్లను నవీ ముంబయి(Mumbai)కి షిఫ్ట్ చేశారు.