బీఆర్ఎస్‌కు ఇంకెన్నాళ్లు దోచిపెడ‌తారు?

క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఇర‌వై ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారులంతా (All granite traders) బీఆర్ఎస్ (BRS)కు దోచిపెడుతూనే ఉన్నార‌ని, ఇంకెన్నాళ్లు దోచిపెడ‌తార‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Minister Bandi Sanjay Kumar) అన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా (Karimnagar district) మానకొండూరు చెరువు (Manakondur Lake) వద్ద నిమజ్జన ఏర్పాట్లు చూస్తుండగా తనను కలిసిన గ్రానైట్ వ్యాపారులను కేంద్రమంత్రి నిలదీశారు. ఒక్కో గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణం నుండి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుండి రూ.50 లక్షలదాకా వసూలు చేసిందని, ఆ సొమ్మును ఏం చేశారో చెప్పాలన్నారు. తీస్తా… ఆ లెక్కలన్నీ త్వరలోనే బయటకు తీస్తా అని అన్నారు.

మోడీకి కలిసాం థాంక్స్ చెప్పారా?
ప్రధాని మోడీ (Prime Minister Modi) చైనా పర్యటనకు వెళ్లాచ్చాక వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని గ్రానైట్ అసోసియేషన్ నేతలు చెప్పగా మరి కనీసం ప్రెస్ మీట్ పెట్టి మోడీకి థ్యాంక్స్ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేద‌ని కేంద్ర మంత్రి అన్నారు. గత 20 ఏళ్లుగా మీరంతా బీఆర్ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారు. మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులై (political leaders) వ్యాపారాలను పెంచుకుంటున్నార‌ని, వచ్చిన సొమ్ముతో రాజకీయాలు చేస్తార‌ని అన్నారు.

నాపై నిందలు వ‌చ్చినా ఎందుకు ఖండించ‌లేదు?
గ్రానైట్ అసోసియేషన్ (Granite Association) నుండి బండి సంజయ్ కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడంటూ జరిగిన దుష్ప్రచారాన్ని ఎందుకు ఖండించ‌లేద‌ని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. ఏనాడైనా మీరు త‌న‌కు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? తాను గెలిచిన తరువాత కూడా మీలో ఒక్కరైనా త‌న‌ దగ్గరకు వచ్చి కనీసం బొకే అయినా ఇచ్చారా? ఒక్క స్వీటు ముక్క కూడా తిన్పించలేదు కదా, కానీ బయట మాత్రం కొందరు త‌న‌కు 700 కోట్ల రూపాయలు ఇచ్చానని నిందలేస్తుంటే మీ అసోసియేషన్ కనీసం ఖండించలేద‌ని మండిప‌డ్డారు. పైగా వందల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు దోచి పెట్టి ఆ పార్టీని ఇంకా సాదుతున్నార‌ని ఆరోపించారు.

కేంద్రానికి చెల్లించింది రూ.300 కోట్లు
గ్రానైట్ అసోసియేషన్ కేంద్రానికి చెల్లించింది రూ. 300 కోట్లకు మించి లేద‌ని, బయటకు పోయి మాత్రం వెయ్యి కోట్లు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారిన బండి సంజ‌య్ అన్నారు. గ్రానైట్ కటింగ్ మిషన్ దుకాణాల నుండి సభ్యత్వం పేరుతో ఒక్కో దుకాణం నుండి రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల దాకా గ్రానైట్ అసోసియేషన్ వసూలు చేసింద‌ని, దాదాపు 350 నుండి 500 షాపుల దాకా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉంద‌ని అన్నారు. మరి ఆ సొమ్మును ఏం చేశారు? దీంతో కంగుతిన్న‌ గ్రానైట్ అసొసియేషన్ నాయకులు సమాజానికి సేవ చేస్తామని అందులో భాగంగానే గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లను ఏర్పాటు చేశామని చెప్పారు.

Leave a Reply