తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.

అటువంటి తిరుమలలో భక్తుల ర ద్దీ స్వల్పంగా తగ్గింది.

సోమవారం సెప్టెంబర్ 1న‌ 65,384 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

22,512 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లుగా నమోదైంది.

ఉచిత సర్వదర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

దీనికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది.

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.

రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్ల‌డించారు.

Leave a Reply