పెద్దపల్లి, ఆంధ్రప్రభ : కాళేశ్వ‌రం విష‌యంలో కాంగ్రెస్ కుట్ర చేస్తోంద‌ని, ఇందుకు నిర‌స‌న‌గా ఈ రోజు పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం జిల్లాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram project) పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు.

ఘోష్ కమిటీ నివేదిక తప్పులతడక ఆని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక అందించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, సీబీఐ (CBI) కి అప్పగిస్తే భయపడే వారెవరు లేరన్నారు. తాము న్యాయస్థానాలను నమ్ముకున్నామని, చివరికి న్యాయమే గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, దాసరి మనోహర్ రెడ్డి, రాకేష్, రాజ్ కుమార్, కోయడ సతీష్, కుమార్ తో పాటు గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.


యాదాద్రి, ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) పై కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని మాజీ ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. సోమవారం భువనగిరి పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో బస్వాపురం ప్రాజెక్టు (Basavapuram Project) నుండి గోదావరి జలాలను తీసుకొచ్చి తెలంగాణ తల్లికి జలాభిషేకం చేశారు.

అనంతరం ప్రిన్స్ చౌరస్తా వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మ ను ద‌హ‌నం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, జనగాం పాండు, ర్యాకల శ్రీనివాస్,కర్రె వెంకటయ్య, పల్లె సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply