ఆంధ్రప్రభ : దొరల పట్టాలను రద్దు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ రోజు నిమ్మగూడెం రైతులు(Nimmagudem farmers) ధర్నా చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను శాంతింపజేసి కలెక్టర్‌తో మాట్లాడించారు.

జయశంకర్ జిల్లా(Jayashankar district) మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామంలో 1956 సంవత్సరంలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు జాయింట్ సర్వే(joint survey) చేసి కేటాయించిన 900 ఎకరాలు ఎస్టీ, ఎస్సీ(ST, SC), బలహీన వర్గాలకు చెందిన వారు సాగు చేసుకుంటున్నారు.

ఆ కాలంలో సర్వేయర్ జగన్నాధ రావు(Surveyor Jagannadha Rao) నిజామాబాదుకు చెందిన అటవీశాఖ అధికారి వారి బంధువుల పేర్ల మీద 600 ఎకరాలు పట్టాలు చేయించుకున్నారని గిరిజనులు ఆరోపించారు. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా న్యాయం జరగలేదని, అక్రమంగా చేసుకున్న దొరల పట్టాలను రద్దు చేసి సాగులో ఉన్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


