భారీ వర్షాలు..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌, కామారెడ్డి, హైదరాబాద్‌తో సహా అనేక జిల్లాల్లో కుండపోత వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీని దృష్ట్యా అధికారులు కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల వల్ల రోడ్లు జలమయమై, అనేక ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి.

ఈ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఆగస్టు 28న సెలవు ప్రకటించారు. రామాయంపేటలో సుమారు 300 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోగా, రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. రైళ్లు కూడా రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయం కూడా ఆగస్టు 28న జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేసింది. రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply