రంగంలోకి వైమానిక దళం..

పెద్దపల్లి : వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్ ను పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.

వరద ప్రభావంతో కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో సుమారు 30 మంది చిక్కుకున్నారని సమాచారం అందిన నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ప్రత్యేక హెలికాప్టర్ పంపించాలని తన విజ్ఞప్తికి రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంగా వరద సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు.

Leave a Reply