- శబరికి వరద పోటు
- 12 ఊళ్లకు రాదారి బంద్
- చింతూరు సంతకు చింత
- నీటిలో చిక్కిన లారీ
(చింతూరు, ఆంధ్రప్రభ) : బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణితో ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. చత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా ఏక దాటి వర్షాలతో మన్యంలోని వాగులు, వంకల దూకుడుతో శబరి నది (River in Manyam)లో జలకళ సంతరించుకుంది. చింతూరు మండల (Chintoor mandal )కేంద్రానికి ఆనుకొని ప్రవహిస్తున్న శబరి నది సైతం నెమ్మదిగా పెరుగుతూ ఉదయం 11 గంటల సమయానికి 34.5 అడుగుల కనిష్ట నీటి మట్టానికి చేరుకుంది.

ఆంధ్రా సరిహద్దు రాష్ట్రాలు (Andhra Border States) ఒడిశా, చత్తీస్గడ్ ల్లో అధిక వర్షపాతం నమోదు అవుతోంది. ఈ వరదల నేపథ్యంలో రెండు వారాలుగా చింతూరు వారంతపు సంతకు చింత వాటిల్లింది. గత బుధవారం వరద నీరు చేరటంతో గిరిజనం చింతూరు సంతకు దూరమయ్యారు. మళ్లీ ఈ బుధవారమూ రహదారులపై వరద నీరు పరవళ్లు తొక్కటంతో ప్రజలు రాకతో చింతూరు సంత వెలవెలబోయింది. వరదల నేపథ్యంలో అధికారులకూ పండగ రోజు తిప్పలు తప్పడం లేదు. వాగులు వంకలు జనం దాటుతారేమో అనే ఆందోళనతో వాగులు వంకల దగ్గరే పండగ రోజూ పహరా కాస్తున్నారు.

12 ఊళ్లకు రాకపోకలు బంద్
అల్లూరి సీతారామరాజు జిల్లా (Seetharamaraju District in Manyam) చింతూరు మండలంలోని శబరి నదికి క్రమంగా వరద పోటెత్తుతోంది. వరద నీరు పొంగి పరవళ్లు తొక్కుతోంది. ఈ నదికి అనుసంధాన వాగులు వంకలు పొంగిపొర్లుతూ రహదారులపై ఉరుకులు పరుగులు పెడుతుంటే.. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలకు బ్రేక్ పడింది. చింతూరు మండలంలోని సోకిలేరు, కుయుగూరు, అత్తకోడల్లు, చంద్రవంక వాగులు సైతం వరదతో నిండుకొని రహదారులపై ప్రవహిస్తున్నాయి.

చింతూరు – వీఆర్ పురం మండలాల ప్రధాన రహదారిపై ఉన్నటువంటి చీకటి వాగు, సోకిలేరు వాగు (Sokileru River) ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండటంతో సుమారు 12 గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. ఈ స్థితిలో ఈ రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపులో 326 హైవే నిమ్మలగూడెం – కుయుగూరు గ్రామాల మధ్య కుయుగూరు వాగు పొంగటంతో ఆంధ్రా – ఒడిశా రాష్ట్రాలను కలుపుతున్న జాతీయ రహదారి (National highway) 326పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు తక్కువగా ఉందనే ఉద్దేశ్యంతో ఒడిశా నుంచి వస్తున్న ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది. ఐరన్ లోడ్‌తో వస్తున్న ఈ లారీ వరద నీటిలో ఆగిపోయింది. ఇక లారీ డ్రైవర్ (Lorry Driver), క్లీనర్లు లారీ దిగి వరద నీటిలో నుంచి నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.