పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీపై ప్రేక్షకుల్లో భారీ హైప్ కొనసాగుతోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా, మూవీ టీమ్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

ఓజీ నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, గ్లింప్స్, పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తుండ‌గా.. ఈ క్రేజ్ మధ్య ఇప్పుడు రెండో సింగిల్ విడుదల ముహూర్తం ఫిక్స్ చేశారు మేక‌ర్స్. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీ ఉదయం 10:08 గంటలకు ఈ సెకండ్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది

“సువ్వి సువ్వి” అంటూ సాగే ఈ పాట యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ మంచి హిట్ సాధించడంతో, రెండో సింగిల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది

Leave a Reply