ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రోజురోజుకీ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొంత మంది దురాశనే పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) మోసాలు చేయడానికి సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా క్యూఆర్ కోడ్స్, ఫేక్ లింకులతో జనం బ్యాంకు ఖాతాల్లోని పైసలను కొట్టేస్తున్నారు.
పెళ్లికి రండి అంటూ..
ఈ విధంగానే మహారాష్ట్ర (Maharashtra)లో వినూత్న రీతిలో సైబర్ కేటుగాళ్లు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతాను ఖాళీ చేశారు. ‘మా పెళ్లికి రండి’ అంటూ క్యూఆర్ కోడ్ (QR code) ఉన్న లింక్‌ను పంపించారు. అయితే, ఆ లింక్‌ను ఓపెన్ చేయగా.. బాధితుడి బ్యాంక్ అకౌంట్ (Bank Account) నుంచి ఏకంగా రూ.2 లక్షలు మాయం అయ్యాయి. దీంతో లబోదిబోమంటూ ఆ ప్రభుత్వ ఉద్యోగి (Government Employee) తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు (police case registration) చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.