ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కొందరు ఆడ పిల్లలు విలాసవంతమైన జీవనానికి (luxurious life) అలవాటు పడి తప్పుదారి పడుతున్నారు. ఇతరులను జీవన విధానాన్ని చూసి వారు అలాగే మెయింటెయిన్ చేయాలనే దురాలోచనతో కొన్ని నీచమైన పనులు చేయడానికి కూడా కొందరు వెనుకాడటం లేదు. వారు చేసేంది కరెక్టా కాదా అనే ఆలోచన లేకుండా తప్పుడు దారి ఎంచుకుంటున్నారు. చదువుకున్న యువతులు (Educated young women) కూడా లేనిపోని ఆశలు, కోరికలతో బతుకును బజారుపాలు చేసుకుంటున్నారు. ఖరీదైన బట్టలు, వస్తువులు (expensive clothes and things) కొనుక్కోవడానికి ఓ యువతి ఏకంగా వ్యభిచార గృహానికి (brothel) వెళ్తుందని తెలిసి ఆమె తల్లిదండ్రులు కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే..
డబ్బు కోసం…
ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University)లో చదువుతున్న ఓ విద్యార్థిని (student) షాపింగ్, విలాసాల కోసం అవసరమైన డబ్బు సంపాదించడానికి జీటీబీ నగర్(GTB Nagar)లోని ఓ వ్యభిచార గృహంలో పార్ట్ టైమ్ ఉద్యోగం (part time job) చేయడం మొదలు పెట్టింది. ఆమె తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకున్నా ఖరీదైన వస్తువులు, దుస్తులు కొనడం.. వాటిని ధరించడం చూసి ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. మేము డబ్బులు ఇవ్వకున్నా ఎలా ఈ వస్తువులు, దుస్తులు కొంటుందని ఆశ్చర్యపోయారు. మొదట ఆమెకు బాయ్‌ఫ్రెండ్ (boyfriend) ఉన్నాడని, అతడే డబ్బు ఇస్తున్నాడని మొదట భావించారు. అసలు నిజం రాబట్టేందుకు ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌కు బాధ్యతలు అప్పగించారు.
నిఘా పెట్టడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి..
కొన్ని రోజుల పాటు ఆ యువతిని అనుసరించిన డిటెక్టివ్(detective), షాకింగ్ విషయాలను కనుగొన్నాడు. ఆమె జీటీబీ నగర్‌లోని ఓ వ్యభిచార గృహంలో పార్ట్ టైమ్ ఉద్యోగం (part time job) చేస్తోందని తేలింది. షాపింగ్, విలాసాల కోసం అవసరమైన డబ్బు సంపాదించడానికే ఆమె ఈ వృత్తిని ఎంచుకుందని దర్యాప్తులో స్పష్టమైంది. ఈ వివరాలను డిటెక్టివ్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. “విలాసవంతమైన జీవితం కోసం ఇంత నీచమైన పని చేయాలా?” అంటూ విద్యార్థిని తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల బాగోగులు, ప్రవర్తనపై నిఘా ఉంచాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.