పార్ల‌మెంట్ లోకి ఆగంతకుడు..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ భవనం (Security Breach At Parliament) వద్ద భద్రతా లోపం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఓ చొరబాటుదారుడు గోడ దూకి లోపలికి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ ఘటన ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగింది. సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి చెట్లు ఎక్కి, ఆ తర్వాత గోడ దూకి పార్లమెంట్‌ ప్రాంగణంలోకి వచ్చాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నాయి.

ఈ ఘటనతో పార్లమెంట్‌ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అత్యంత సురక్షిత ప్రాంతాలలో ఒకటైన పార్లమెంట్ భవనం వద్ద ఇలాంటి ఘటన జరగడం భద్రతాపరమైన సవాళ్లను సూచిస్తుంది. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఈ వ్యక్తి ఎందుకు లోపలికి ప్రవేశించాడో, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply