భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో శుక్రవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడినా, అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట మండలం గట్టు గూడెం గ్రామ శివారులో ఇవాళ ఉదయం ఓ ప్రైవేటు మినీ ట్రావెల్స్ బస్సు (travel bus) అదుపుతప్పి రోడ్డు వెంబడి ఉన్న పొదల్లోకి వెళ్ళి బోల్తా పడింది. ఈ బస్సు విశాఖపట్నం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 20మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో పొదల్లోకి దూసుకెళ్లింది.

బస్ బోల్తా (bus accident) పడడంతో ప్రయాణికులు, స్థానికులు అక్కడ ఉన్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై సాయి కిషోర్ రెడ్డి (SI Sai Kishore Reddy) ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Leave a Reply