అన్నమయ్య జిల్లా: రాజంపేట మండలం బాలరాజుపల్లి సమీపంలోని చెయ్యేరు నదిలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు.

రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం విద్యార్థులు తమ స్నేహితులతో కలిసి నదిలో ఈతకు వెళ్లారు. అయితే, ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు.

ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న రాజంపేట ఏఎస్పీ, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.

మృతులు రాజంపేటకు చెందిన సోంబత్తిన దిలీప్ (22), ఒంటిమిట్ట మండలం మంటపంపల్లికి చెందిన కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి (22), పోరుమామిళ్లకు చెందిన పీనరోతు కేశవ (22)గా పోలీసులు గుర్తించారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Leave a Reply