ప్రభాస్‌ ‘ఫౌజీ’ ఫొటో లీక్‌.. ప్రొడక్షన్‌ హౌస్‌ వార్నింగ్‌

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: హను రాఘవపూడి (Hanu Raghavapudi), ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌)గా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్‌ లుక్‌ లీకైంది. అందులో ఈ హీరో (Prabhas) వింటేజ్ లుక్‌లో కనిపించడంతో అది క్షణాల్లో వైరలైంది. నెటిజన్లు దాన్ని తెగ షేర్‌ చేశారు. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఇక ‘ఫౌజీ’ విషయానికొస్తే.. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. విభిన్నమైన కథ, భారీ బడ్జెట్‌తో సిద్ధమవుతోంది. ప్రభాస్‌కు జంటగా సోషల్‌మీడియా స్టార్‌ ఇమాన్వీ (Imanvi Esmail) నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నారు. 1940వ దశకంలో జరిగే కథగా.. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా మూవీ రానుంది.

Leave a Reply