• పర్యాటకులను ఆకట్టుకుంటున్న జలపాతం


వాజేడు, ఆగస్టు 20 ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) మినీ నయాగార జలపాతంగా పిలవబడే ములుగు జిల్లా వాజేడు మండల (Wajedu Mandal) పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగతా జలపాతం అందాలు పర్యాటకులను అబ్బుర పరుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా బోగత జలపాతం (Bogatha water falls) ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో బోగత సందర్శన నిలుపుదల చేసిన అటవీశాఖ అధికారులు నేటి నుండి బొగత సందర్శనకు అనుమతి ఇచ్చారు.

చుట్టూ పచ్చని అడవి పక్షుల కేరింతల నడుమ అందాలను వెదజల్లే బోగత జలపాతం సుమారు 50 అడుగుల ఎత్తు నుండి కిందికి పాలనూరుగుల నీటిని జాలువారితో తుంపర్లు వెదజల్లుతుంటే ఎన్నెన్నో అందాలు చూడతరమా అనే విధంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి నిండుగా ప్రవహిస్తున్న బోగత జలపాతం ((Bogatha water falls) అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి ప్రకృతి ఒడిలో ఉద్భవించే ఈ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ అందాల సోయగం అడవి తల్లి ఒడిలో ఆడుతున్నట్లు పలువురిని అబ్బురపరుస్తుంది. ఈ అందాలను చూడడానికి తరలిరావాలి తనివి తీరాలి అంటుంది మన్యంలోని అడవి తల్లి….

Leave a Reply