ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన (Indian Space Research) ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో దూసుకెళుతూనే ఉంటుంది. భారత్ సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటుతూనే ఉంటుంది. అదే క్రమంలో తమ తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఇస్రో చైర్మెన్ వి.నారాయణన్ తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఆయన.

ఆ సందర్భంగా మాట్లాడుతూ… ఈ విషయాన్ని వెల్లడించారు. ఏకంగా నలభై అంతస్థులంత ఎత్తైన భారీ రాకెట్ (huge rocket) ను నిర్మించే పనిలో ఉన్నామని వెల్లడించారు. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం, ఎన్.1 రాకెట్ (N.1 rocket) ప్రయోగం, అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ (Communication satellite) ను కక్ష్యలోకి చేర్చడం వంటి ప్రాజెక్టులు తమ ముందున్న లక్ష్యమన్నారు ఆ సంస్థ చైర్మెన్. ప్రస్తుతం భారత్ కు కక్ష్యలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మూడు లేదా నాలుగు రెట్లకు పెంచనున్నామని తెలిపారాయన.

Leave a Reply