• ఎస్వీయూ బోనులో చిక్కి..
  • శేషాచల అడవికి చేరిందోచ్


(ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) : తిరుమల (Tirumala) ఎస్వీ వర్సిటీలో.. గత పదిహేను రోజులుగా అటవీశాఖ నిరంతర నిఘా ఫలించింది. ఆదివారం అర్ధరాత్రి అటవీశాఖ ఎరకు ఓ మగ చిరుత పులి చిక్కింది. ఈ చిరుత (Leopard)ను శేషాచలం అడవుల్లో (Seshachalam Forest) వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలకు ముఖద్వారం అలిపిరి నుంచి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వరకు ఇటీవల చిరుతలు సంచరిస్తున్నాయి. అలిపిరి బైపాస్ (Alipiri Bypass) రోడ్డు లోని అరబిందో కంటి ఆసుపత్రికి సమీపంలో మూడు వారాల కిందట బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు శేషాచలం కొండలకు (Seshachalam Hills) దిగువన దట్టమైన అడవిలో ఒక బోను ఏర్పాటు చేశారు. అందులో ఓ జంతువును కూడా ట్రాప్ కెమెరాలు అమర్చారు. 15 రోజులుగా నిరంతరం నిఘా ఉంచినప్పటికీ చిరుత బోనులో చిక్కలేదు. ఈ పరిస్థితిని అధ్యయనం చేసిన తిరుపతి అటవీ శాఖ అధికారులు (Tirupati Forest Department officials), చిరుత సంచారం పై దృష్టి నిలిపారు.

తిరుపతి (Tirupati) ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనం వెనుక మరో మూడు బోన్లను అమర్చారు. తిరుమల అలిపిరి బైపాస్ రోడ్డుకు కేవలం కొంత దూరంలోనే మెట్ల మార్గం ఉంది. వన్య మృగాలతో ప్రజలకు ప్రాణ నష్టం జరగకూడదని తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (Venkateswara University) తో సహా సమీపంలోని అడవిలో నాలుగు చోట్ల చిరుత పులుల కోసం బోన్లు ఏర్పాటు చేశారు. గత మూడు వారాలుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్, వేదిక్ విశ్వవిద్యాలయం (Vedic University), అలిపిరి – జూ రోడ్డు సమీపంలో చిరుతపులి సంచారంపై నివేదికల ఆధారంగా నాలుగు ట్రాప్ బోనులను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో, ఒక మగ చిరుతపులి ఈ బోనులో చిక్కింది.

Leave a Reply