సాగునీరు సముద్రం పాలు చేస్తున్నారు..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సాగునీటి విలువ తెలియదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) మండిప‌డ్డారు. ఆదివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.. సాగునీరు సముద్రం పాలు చేస్తున్నారని చెప్పినా.. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తుంద‌ని విమ‌ర్శించారు. బీఆర్ఎస్‌ మీదున్న కోపంతో కాళేశ్వరం(Kaleshwaram Project) మోటర్లు ఆన్ చేయడం లేదని సీరియస్ అయ్యారు. వర్షాల వల్ల నదులకు భారీగా వరదలు వచ్చాయి. ఒక్కరోజులో ఎస్సారెస్పీ నిండుతుంది. అయినా మిడ్ మానేరుకు ఇంకా నీరు ఎందుకు వదలడం లేదు అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులను ఆగం చేయొద్దు.. తక్షణమే ప్రాజెక్టుల నుంచి నీరు వదలాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని కోరారు. రిజర్వాయర్ల విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లెటర్ రాశానని అన్నారు.

Leave a Reply