బిగ్‌బాస్‌-2 విజేత ఇంటిపై 24 రౌండ్ల కాల్పులు

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: హిందీలో బిగ్ బాస్ OTT సీజన్ 2 (Bigg Boss 2) విజేతగా నిలిచి, సోషల్ మీడియాలో బాగా పేరు సంపాదించుకున్న ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై కాల్పుల (gunfire) ఘటన తీవ్ర కలకలం రేపింది. గురుగ్రామ్‌లో ఉన్న అతని నివాసంపై గుర్తుతెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు.

ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఎల్విష్ ఇంటి వద్ద కాల్పులు జరిపి పారిపోయారు. మొత్తం 24 రౌండ్లు కాల్పులు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

ఎల్విష్ యాదవ్ ప్రస్తుతం ‘బిగ్ బాస్ OTT’ సీజన్ 2 విజేతగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం పట్ల ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్పులు జరిపిన వారిని గుర్తించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం పోలీసులు ఎల్విష్ యాదవ్ కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply