- పొంగిపొర్లుతున్న వాగులు…
- వాగుల పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు
తలమడుగు, ఆగస్టు 16(ఆంధ్రప్రభ) : బంగాళాఖాతం (bangla khatam) లో ఏర్పడిన అల్పపీడన ద్రోనితో మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు (Streams and meanders) పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదీ పరీవాహక ప్రాంత పంట చేళ్లలోకి వరద నీరు చేరడంతో పంటలు దెబ్బతినడం (Crop damage)తో రైతులు ఆందోళన చెందుతున్నారు.
భారీ వర్షాల (HeavyRain) తో వాగులు, వంకలు పొంగిపొర్లి జనజీవనం స్తంభించిపోయింది. తలమడుగు భీమన్నవాగులు ఉప్పొంగి ప్రవహించడంతో జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రానికి విధులు నిర్వహించేందుకు వచ్చే అధికారులు ఇబ్బందులు పడ్డారు. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో గల ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు (People) అవస్థలు పడ్డారు.