• గిరిపుత్రిక దెబ్బకు రాజశేఖరుడు అబ్బా
  • ఇక అరెస్టు ఆలస్యం.. ఎస్ఐకి జైలు బువ్వ తథ్యం
  • న్యాయం కోసం వెళితే వెకిలి చేష్టలు
  • దిగంబర వీడియోతో విశ్వరూపం ఫలితం
  • రికార్డు చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన బాధితురాలు

(ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో) : ఆమె ఒక గిరి పుత్రిక.. పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి… భర్తతో గొడవలు… విడాకులు తీసుకుంది. ఈ విషయంలో తనకు తగిన న్యాయం జరగలేదు అంటూ పోలీస్ స్టేషన్ (Police station) గడప తొక్కింది. తన గోడును వెళ్లగక్కింది. ఆదుకోవాలని ఆశ్రయించిన ఆమె వెన్నుదన్నుగా నిలవాల్సిన పోలీసు అధికారి తన బాధ్యతను విస్మరించాడు.. సదరు అబలపై కన్నువేశాడు. ఆమెను శారీరకంగా అనుభవించాలని ఆశపడ్డాడు. ఆశపడ్డది ఆలస్యం తన ప్రైవేట్ గది నుంచి వీడియో కాల్ చేసి తన విశ్వరూపం చూపించాడు. తన కోరిక తీర్చాలని వేధించడం (Harassment) మొదలుపెట్టాడు. సభ్య సమాజానికి తలవొంపులు తెచ్చే విధంగా ప్రవర్తించాడు. ఇంకేముందీ.. ఉన్నది ఊడింది. ఉంచుకున్నది పోయిందనట్టు.. ఇప్పటికే భార్య దూరం కాగా.. బంగారం లాంటి ఉద్యోగం ఊడిపోయింది. ఇటీవల వెలుగు చూసిన ఖాకీచోత్తముడిని ఉద్యోగం నుంచి ఉద్వాసన పలుకుతూ పోలీసు శాఖ (Police Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆయన జైలు గోడల్లో కన్నీళ్లు పెట్టే స్థితి ఏర్పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గ ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవి బ్రాహ్మణ పల్లి తండాకు చెందిన ఒక గిరిజన మహిళ ఉద్యోగి వ్యక్తిగత కారణాల వల్ల తన భర్తతో విడాకులు తీసుకుంది. విడాకుల సందర్భంగా తనకు తగిన న్యాయం జరగలేదు అంటూ పట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి, తగిన న్యాయం చేయాలని కోరింది. కానీ పట్నం ఎస్ఐ రాజశేఖర్ (SI Rajasekhar) సదరు బాధిత మహిళ పట్ల సానుకూలంగా స్పందించక పోగా, ఆమెపై మోజు పెంచుకొని, ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ… అసభ్య పదజాలం, లైంగికంగా లొంగదీసుకోవడానికి ఏకంగా వీడియో కాల్ చేసి, తన అంతర్గత అవయవాలను చూపిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. అసలే వ్యక్తిగత సమస్యతో సతమతమవుతున్న ఆమెకు పోలీసులు న్యాయం చేస్తారని ఆశించిన ఆమెకు ఎస్ఐతో సరికొత్త సమస్య (problem) తలెత్తింది. దీంతో ఆమె పోలీసులలో ఇంత కీచకులు ఉన్నారా అనే ఆవేదనను వ్యక్తం చేసి, ఈ విషయాన్ని ఇంతటితో వద్దులే అనుకోకుండా, తనకు జరిగిన అవమానం భవిష్యత్తులో మరో మహిళకు ఎదురు కాకూడదనే ఆలోచనతో, ఎస్ఐ రాజశేఖర్ భాగోతం వీడియో రికార్డు చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఎస్సై వీడియో వైరల్ గా మారింది. మహిళా సంఘాలు స్పందించి బాధిత మహిళకు న్యాయం జరగాలంటూ మద్దతు తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన జిల్లా ఎస్పీ వీ.రత్న ఎస్ఐ రాజశేఖర్ ను వెంటనే వీఆర్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు (inquiry ordered). ఈ విచారణలో ఎస్ఐ రాజశేఖర్ అసభ్య వ్యవహారం నిజమని నిగ్గుతేలింది. ఫలితంగా ఆయన ఉద్యోగం ఊడింది. ఇంకో విషయం ఏమిటంటే.. తన భార్యతో గొడవ పడి.. పట్నంలోనే ఓ అద్దెభవనంలో బస చేస్తూ ఈవ్ టీజరయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఇక సత్యసాయి జిల్లా (Sathya Sai District) లోని పలు ప్రాంతాల్లో పోలీసులు మహిళా బాధితుల పట్ల లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటనలు బయటపడిన విషయం తెలిసిందే. ఎస్పీ రత్న.. సకాలంలో స్పందించి ఓ మహిళకు జరిగిన అన్యాయంపై పోలీసులను వదిలిపెట్టనందుకు శ్రీసత్యసాయి జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply